శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీఐఐసీ చైర్మన్ రోజా

చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు ఆమె వెళ్లారు.  ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.